మడకశిర : రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు , మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి విమర్శించారు. శుక్రవారం మండల పరిధిలోని బుళ్ళసముద్రం గ్రామంలో నిర్వహించిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్బంగా ఆయన ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల గురించి ప్రజలకు వివరించారు. ఈసందర్భంగా బుళ్ళసముద్రం గ్రామంలో వైసిపికి చెందిన నాగరాజప్ప, గంగయ్య, ఓబుల నరసింహా, ఓబులేశు, రవి, డిజె హనుమంతు,క్యాంపురం వడ్డే సీన తదితరులు మాజీ ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో టిడిపిలోకి చేరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, పట్టణ అధ్యక్షుడు మనోహర్, ప్రధాన కార్యదర్శి కోట్ల రంగేగౌడ్, క్లస్టర్ ఇంచార్జ్ నాగరాజు, కన్నా తదితరులతో పాటు నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.
పెనుకొండ : జగన్ పోవాలని చంద్రబాబు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షులు బికె. పార్థసారథి పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని బోయ పేటలో నిర్వహించిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమంలో బికె పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయనకు నాయకులు అశ్వర్థనారాయణ, బోయ అనీల్, బాలకృష్ణ, రాము తదితరలుఉ ఘనస్వాగతం పలికారు. అనంతరం ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి సవితమ్మ, జిల్లా మహిళా అధ్యక్షురాలు సుబ్బరత్నమ్మ, మునిమడుగు వెంకట రాముడు, మాజీ ఎంపీపీ కేశవయ్య, కురుబ కృష్ణమూర్తి, లక్ష్మీనారాయణ రెడ్డి, గుట్టూరు సూర్యనారాయణ, శ్రీనివాసులు, నాగరాజు, జిల్లా అధికార ప్రతినిధి రఘువీరా చౌదరి,రామలింగ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
పుట్టపర్తి అర్బన్ : పుట్టపర్తి నగర పంచాయతీలోని ఎనుములపల్లిలో నిర్వహించిన ఇదేమి ఖర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లెరఘునాథరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ్ల మాట్లాడుతూ జగన్ పాలనలో రాష్ట్రంలోని ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారన్నారు. మూడున్నర ఏళ్ల పాలనలో ఒక్క ప్రాజెక్టు గాని నిర్మించలేదని ఒక్క పరిశ్రమ గాని నెలకొల్పలేదని అన్నారు. రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న వైసిపి ప్రభుత్వాన్ని ఇంటికి పంపుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ కన్వీనర్ రామాంజనేయులు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రత్నప్ప చౌదరి, నాయకులు సామకోటి ఆదినారాయణ, చిమిరాల సుధాకర్, దయ్యాల ఉమాపతి, జయప్రకాష్, కేశవ నాయుడు, గంగాద్రి తదితరులు పాల్గొన్నారు.










