Dec 16,2022 21:59

మడకశిరలో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్న టిడిపి నాయకులు

కదిరి టౌన్‌: రాష్ట్రంలో రాక్షస పాలనకు బుద్ధి చెబుదామని టిడిపి మండల అబ్జర్వర్‌ మోపురిశెట్టి చంద్రశేఖర్‌, పట్టణ అధ్యక్షుడు డైమండ్‌ ఇర్ఫాన్‌ అన్నారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమాన్నిపట్టణంలోని ఆరో వార్డు, రైల్వే స్టేషన్‌ రోడ్‌, కదిరి రూరల్‌ మండలం ఏకలచెరువుపల్లిలో శుక్రవారం నిర్వహించారు. ఈసందర్భంగా వారు ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు చెన్నకేశవులు, రమణ, శ్రీనివాసులు, రామచంద్ర, షాకీర్‌, అంజి, రామచంద్ర, నౌషాద్‌, పర్వీన్‌ భాను, ప్రకాష్‌, రాజేంద్ర నాయుడు తదితరులు పాల్గొన్నారు.
అమరా పురం : రాష్ట్రంలో అరాచకపాలన సాగుతోందని టిడిపి నాయకులు విమర్శించారు. మండల పరిధిలోని వీరాపురం గ్రామంలో ఇదేంఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని టిడిపి నాయకులు శుక్రవారం నిర్వహించారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం చేపట్టిన ప్రజావ్యతిరేక కార్యక్రమాల పట్ల ప్రజలు విసిగి పోయారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసిపి ఇంటికి వెళ్లడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ నరసింహ, మండల కన్వీనర్‌ వీరపసముద్రం గణేష్‌, నాయకులు శివరుద్రప్ప, కృష్ణమూర్తి, జయరాం, నాగరాజు, మాజీ ఎంపిటిసి చంద్రప్ప, నాగభూషణ తదితరులు పాల్గొన్నారు
గాండ్లపెంట : మండల పరిధిలోని చామాలగొంది, బండమీద పల్లి, గాజులవారిపల్లి, రెడ్డివారిపల్లి, సింగన్నవారిపల్లి తదితర గ్రామాలలో టిడిపి నాయకులు ఇదేంఖర్మ మనరాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈసందర్భంగా నాయకులు ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల ఇన్‌ఛార్జి నరసింహారెడ్డి, మహిళా సభ్యురాలు పర్వీన్‌భాను, నాయకులు కొండయ్య, జయరాం, కృష్ణారెడ్డి, శివపునాయుడు తదితరులు పాల్గొన్నారు.
మడకశిర : రాష్ట్రాన్ని పాలిస్తున్న వైసిపి ప్రభుత్వాన్ని సాగనంపుదామని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పిలుపునిచ్చారు. శుక్రవారం మండల పరిధిలోని ఉప్పిడి పల్లి గ్రామంలో, పట్టణంలోని 1వ వార్డులో నిర్వహించిన ఇదేంఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీతో పాటు టిడిపి రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్‌ మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈసందర్బంగా వారు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు లక్ష్మీ నారాయణ, మనోహర్‌, భక్తర్‌, రాజాతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
రామగిరి : మండలంలోని శేషంపల్లిలో శుక్రవారం నిర్వహించిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రంగయ్య, సుధాకర, మారుతి ప్రసాద్‌, శ్రీధర్‌ నాయుడు, పరంధాం యాదవ్‌, తదితరులు పాల్గొన్నారు.
ధర్మవరం టౌన్‌ : వైసీపీ పాలనలో రాష్ట్ర అభివద్ధి తిరోగమనంలో నడుస్తోందని టీడీపీ నాయకులు విమర్శించారు. పట్టణంలోని 19, 20, 32, 33 వార్డులలో ఇదేం ఖర్మ మనరాష్ట్రానికి కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిఇంటికి వెళ్లి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పణికుమార్‌ పరిశేసుధాకర్‌, గోసలశ్రీరాములు, కేతినేనిరాజ, కేశగాళ్ల శ్రీనివాసులు, తొగట అనిల్‌, మారుతీస్వామి, బాలనాగరాజు, చండ్రాయుడు తదితరులు పాల్గొన్నారు.
అమడగూరు : మండలంలోని కొట్టువారిపల్లి గ్రామ పంచాయతీలోనిజవకల కొట్టు వారి పల్లి, బాలప్ప గారిపల్లి, సానే వారి పల్లి, గువ్వలపల్లి తదితర గ్రామాలలో శుక్రవారం నిర్వహించే ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోపాల్‌ రెడ్డి, శ్రీనివాస్‌ రెడ్డి, కాలేనాయక్‌, కృష్ణమూర్తి, రఘువీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.