రాయచోటి : రాష్ట్రంలోని వైసిసి ప్రభుత్వ ఆరాచక, విధ్వంసకర పాలనలో ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని టిడిపి రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదరభాష పేర్కొన్నారు. బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక పాలనను ప్రశ్నిస్తే ప్రజలు, ప్రతిపక్షాలపై దాడులు, కేసులు, హింసాత్మక ఘటనలు, పోలీసు టార్చర్ అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ఇందుకు గన్నవరం ఘటనలో తెలుగు దేశం పార్టీ కార్యాలయంపై, పార్టీనేతల ఇళ్లపై, కార్యకర్తలపై దాడులు చేసి వారిఆస్తులు ధ్వంసం చేయడంతో పాటు వారినే పోలీస్ టార్చర్‌కు గురిచేసి ఆ బాధితులనే నిందితులుగా మార్చి, జైలుకు పంపిన వైనం చరిత్రలో జరగలేదన్నారు. అరాచక పాలనతో ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందిని జీవితాంతం కష్టపడి పేదలు సంపాదించుకున్న ఆస్తులను కబ్జా చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తల నిర్బంధాలు, అక్రమ కేసులు బడుగు, బలహీన, దళిత, మైనారిటీ వర్గాలకు వేధింపులు, మహిళలపై ఆకృత్యాలకు రాష్ట్రం వేదికగా మారిందన్నారు.మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పర్యటనలకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన కనిపిస్తుందన్నారు. ప్రజా సమస్యలపై నిలదీస్తున్న టీడీపీ నేతలను జైలుకు పంపాలి అనే ఏకైక ఉద్దేశ్యంతో టీడీపీ నేతలపై హత్యాయత్నం, అట్రాసిటీ సెక్షన్ కింద కేసులు జైలు పాలు చేస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్‌రెడ్డికి ప్రజల తగిన గుణపాఠం చెప్తారని చెప్తారన్నారు. కార్యక్రమంలో చిన్నమండ మండల అధ్యక్షుడు బెల్లం నర్సింహారెడ్డి, రాజంపేట పార్లమెంటరీ కార్యనిర్వాహ కార్యదర్శి హరి, అమర్నాథ్‌రెడ్డి పాల్గొన్నారు.










