Dec 27,2022 22:28

సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి పరిటాల సునీత

పుట్టపర్తి అర్బన్‌ : రాష్ట్రంలో దౌర్జన్యాలు దాడులు చేస్తూ వైసీపీ ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి విమర్శించారు. మంగళవారం మండల పరిధిలోని నిడిమామిడి పంచాయతీ కేంద్రంలో నిర్వహించిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమంలో పల్లెతో పాటు టిడిపి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడున్నర ఏళ్ల పాలనలో వైసిపి ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. ఈ అరాచక దౌర్జన్య పాలనకు ప్రజలు చమర గీతం పాడటానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్‌ మండల కన్వీనర్‌ విజరు కుమార్‌, టిడిపి జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ, తెలుగు యువత కార్యనిర్వహక కార్యదర్శి అంబులెన్స్‌ రమేష్‌, గ్రామస్తులు పాల్గొన్నారు.
మడకశిర : రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిని గాలికి వదిలేసిందని టిడిపి నియోజకవర్గ ఇన్‌చార్జి ఈరన్న విమర్శించారు. మండల పరిధిలోని ఆమిదాలగొంది గ్రామ పంచాయతీలో మంగళవారం నిర్వహించిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈరన్న మాట్లాడుతూ మూడున్నర సంవత్సరాల కాలంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్దిని ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని అన్నారు. .ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాండురంగప్ప, రవిభూషన్‌, ఆదినారాయణ, అశ్వర్థామప్ప,ఉగ్ర నరసింహ, ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.
నల్లచెరువు : మండల పరిధిలోని మద్దిమడుగు, పంతుల చెరువు, తవలంమర్రి గ్రామాలలో మంగళవారం తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఇదేం ఖర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా నాయకులు ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్‌ రాజశేఖర్‌ బాబు, నాయకులు లక్ష్మీపతి నాయుడు, మాబుసాబ్‌, మాజీ సింగిల్‌ విండో చైర్మన్‌ అంజనప్ప, సీనియర్‌ నాయకులు నాగభూషణ నాయుడు, అశ్వర్థ నాయుడు, లక్ష్మీనారాయణ, వూరాతి గంగాధర్‌, తిరుపాలు, నాగబయప్ప తదితరులు పాల్గొన్నారు.
రొద్దం : రైతుల బతుకులు మారాలంటే వైసీపీని గద్దె దింపాల్సిందే అని మాజీ ఎమ్మెల్యే బికె. పార్థసారథి అన్నారు. మండలపరిధిలో తడంగిపల్లి, మోపాలపల్లి గ్రామాల్లో మంగళవారం నిర్వహించిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమంలో అయన తో పాటు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి సవిత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి సత్యసాయి జిల్లా మహిళా అధ్యక్షురాలు లీలావతి, సుబ్బరత్నమ్మ, నరసింహులు, చిన్నప్పయ్య, నరహరి తదితరులు పాల్గొన్నారు.
కనగానపల్లి : రాష్ట్రంలో గతంలోని టిడిపి పాలన ఎలాఉందో, ప్రస్తుత వైసీపీ పాలన ఎలాగుందో ప్రజలే నిర్ణయించుకోవాలని మాజీ మంత్రి పరిటాల సునీత సూచించారు. మండలంలోని మామిళ్లపల్లి గ్రామంలో మంగళవారం జరిగిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. స్థానిక నాయకులతో కలస ఇంటింటికీ వెళ్లి ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్నారు. మాజీ మంత్రి పరిటాల సునీత పర్యటనలో వైసీపీ నాయకులు వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు దారి తీసింది. వైసీపీ మండల కన్వీనర్‌ గా ఉన్న అమర్‌ నాథ్‌ రెడ్డి పుట్టినరోజు వచ్చే నెల 8వ తేదీ ఉంటే.. ఇవాళ సునీత పర్యటన నేపథ్యంలో ఎక్కడ చూసిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆయన ఫ్లెక్సీలకు ఎలాంటి ఇబ్బంది రాకూడదని పోలీసులు కాపలాగా కనిపించారు. మామిళ్లపల్లి సెంటర్లో ఇద్దరు ఎస్‌ఐలు, 20 మంది పోలీసులు కాపలాగా ఉండడం అందర్నీ ఆశ్చరానికి గురి చేసింది. మండలంలో జరుగుతున్న పరిణామాలపై పరిటాల సునీత తీవ్రంగా స్పందించారు. తాను గ్రామంలో పర్యటిస్తుంటే ప్రజలు ఎవరూ బయటకు రావద్దని.. సమస్యలు చెప్పవద్దని వాలెంటీర్ల ద్వారా బెదిరిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు ఏక పక్షంగా వ్యవహరించి తమ వాళ్లను ఇబ్బంది పెడితే స్టేషన్ల ఎదుట ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండలకన్వీనర్‌ యాతం పోతలయ్య, జిల్లాఉపాధ్యక్షులు నెట్టెం వెంకటేష్‌, సుధాకర్‌ చౌదరి, ముకుందనాయుడు, గంగిరెడ్డి, ప్రధానకార్యదర్శి నరేందర్‌ రెడ్డి, దామోదర్‌ రెడ్డి, సుబ్రహ్మణ్యం, తెలుగుయువత బట్టా సురేష్‌ చౌదరి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
కదిరి టౌన్‌ : కదిరిలో కబ్జాలు పెరిగిపోయాయని టిడిపి పట్టణం అధ్యక్షుడు డైమండ్‌ ఇర్ఫాన్‌ ఆరోపించారు. రాష్ట్రానికి ఇదేం కర్మ కార్యక్రమం టిడిపి నాయకులు ఇనాయత్‌ ఆధ్వర్యంలో మంగళవారం కదిరిలో నిర్వహించారు. ఈసందర్భంగా వారు ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రెడ్డి బాషా, బాబావలి, కతాబలి ఖాన్‌, పర్వీన్‌ భాను, ఖాదర్‌బాషా, జిలాన్‌ఖాన్‌, సులేమాన్‌ , హైదర్‌, జావీద్‌, రోషన్‌, శంవాజ్‌, బావాజాన్‌, ప్రేమలత ఉమాదేవి గంగ రత్నమ్మ, శారద ఆయేషా, తదితరులు పాల్గొన్నారు.