Jul 12,2021 20:22

అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో 62,657 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 1578 మందికి వ్యాధి సోకినట్లు తేలింది. 22 మంది మరణించారు. మరో 3,041 మంది కోలుకుని డిశ్చార్జయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 27,195 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సోమవారం రాష్ట్రంలో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 305, చిత్తూరులో 257 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 31, విజయనగరం, కర్నూలులో 35 కేసులు నమోదయ్యాయి. కరోనా లక్షణాలతో చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ముగ్గురేసి, శ్రీకాకుళంలో ఇద్దరు, కర్నూలు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 13,024కు చేరిందని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొంది.