అమరావతి : రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య నేటితో 13 వేలు దాటింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 16 మంది కరోనా బాధితులు మృతిచెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 13,002కి చేరింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ వివరాలు వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 91,677 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 2,665 కేసులు నమోదు అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,22,843 మంది వైరస్ బారినపడ్డారు. ఇదే సమయంలో 3,231 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 18,81,161కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 28,680 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 2,29,86,288 నమూనాలను పరీక్షించారు.










