May 26,2023 20:19

- సమావేశంలో మాట్లాడుతున్న కాంగ్రెస్‌ నాయకులు

రాయచోటి : రాష్ట్రం బాగుండాలంటే కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాలని కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గం ఇన్‌ఛార్జి అల్లా బకాస్‌ అన్నారు. శుక్రవారం పార్టీ కార్యలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిందన్నారు. రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టిందని తెలిపారు. కడప జిల్లాలో స్టీల్‌ ప్లాంట్‌కు స్వస్తి పలికింది దుగరాజపట్నం ఓడరేవు వూసే లేదని తెలిపారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలకు, బుందేల్‌ఖండ్‌ తరహా ప్రత్యేక అభివద్ధి ప్యాకేజీకి తిలోదకాలు ఇచ్చింది. పోలవరం ప్రశ్నార్థకమైందన్నారు. విశాఖ రైల్వే జోన్‌ ప్రస్తావనే లేదు, విశాఖ విజయవాడ మెట్రో రైల్‌ లో వూసే లేదన్నారు. ఆంధ్రుల ఆత్మవివాహానికి ప్రత్యేక అయినా విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ను అమ్మకానికి పెడుతుంది, ఆంధ్ర బ్యాంకును కాలగర్భంలో కలిపేసింది, బిజెపి దేశాన్ని అప్పుల భారత్‌ చేసిందని చెప్పారు. 1947 నుంచి 2014 వరకు 67 సంవత్సరాలలో పండిట్‌ నెహ్రూ వదులుకొని మన్మోహన్‌ సింగ్‌ వరకు 13 మంది ప్రధానుల కాలంలో కేంద్ర ప్రభుత్వం రూ.46 లక్షల కోట్ల అప్పు చేయగా కేవలం ఎనిమిది సంవత్సరాల కాలంలో మోడీ ప్రభుత్వం అదనంగా రూ.109 లక్షల కోట్లు అప్పు చేసింది. బిజెపి దేశాన్నిఅమ్మకానికి పెట్టిందని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, రైల్వే స్టేషన్లను అమ్మేస్తుంది. నిరుద్యోగం పెరిగిపోతుంది పెట్రోలు, డీసలు, వంట గ్యాస్‌ నిత్యవసర సరుకులు ధరలు సామాన్యునికి అందుబాటులో లేవు. బిజెపి కక్ష రాజకీయాలు ఎక్కువయ్యాయని తెలిపారు. ఆరు సూత్రాల కార్యక్రమాలు కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు సంవత్సరాల కార్యక్రమాన్ని అమలు చేస్తుందన్నారు. అవి రూ.6 లక్షల వరకు వ్యవసాయ రుణాలు మాఫీ, రూ.500లకే వంటగ్యాస్‌ సిలిండర్‌ సరఫరా, ప్రతి నిరుపేద కుటుంబానికి నెలకు రూ.ఆరు వేలు ఆర్థిక సహాయం, సంజీవిని లాంటి ప్రత్యేక హోదా అములు, కడప జిల్లాలో స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ ఆధ్వర్యంలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని విధాల ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో ఎపిసిసి డెలిగేట్‌ ఎమ్‌డి గౌస్‌, ఎపిసిసి మైనార్టీ వైస్‌ చైర్మన్‌ మహమ్మద్‌ రఫీక్‌, డిసిసి జనరల్‌ సెక్రెటరీ ఖదీర్‌, యువజన జిల్లా అధ్యక్షుడు ఖాదర్‌ ఖాన్‌, ఉతన్న ,అమర్నాథ్‌ రెడ్డి, మైసరారెడ్డి, వెంకటేశ్వర్లు, జఫ్రూల్లా, షాజహాన్‌ పాల్గొన్నారు.