ప్రజాశక్తి - ఓబుల దేవర చెరువు : వైసిపి ప్రభుత్వం రాష్ట్రాన్ని నట్టేట ముంచిందని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి విమర్శించారు. మండలంలోని కొండకమర్ల గ్రామపంచాయతీలో బుధవారం నిర్వహించిన నీ ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమంలో పల్లె పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన శేషయ్యగారిపల్లి, శేషయ్య గారి పల్లి తండా, ఎస్ కొత్తపల్లి గ్రామాలలో పర్యటించి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ జయచంద్ర, ప్రధాన కార్యదర్శి పీట్ల సుధాకర్, షఫీ అహ్మద్, రాజారెడ్డి, కీరేనాయక్, రామాంజనేయులు, జాకీర్ అహ్మద్, రాష్ట్ర బీసీ సెల్ నాయకులు అంజినప్ప, కరుణాకర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, పార్లమెంటు తెలుగు యువత కార్యదర్శి జయ చంద్రారెడ్డి, నియోజకవర్గ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎస్ గంగాద్రి, మండే జి ఆరిఫ్ ఖాన్ , షాను, కొండే ఈశ్వరయ్య, శంకర తదితరులు పాల్గొన్నారు.










