Nov 14,2023 20:51

మినీ మేనిఫెస్టోను వివరిస్తున్న మీనాక్షి నాయుడు

ప్రజాశక్తి-ఆదోని
రాష్ట్ర ప్రగతిని పరుగులు పెట్టించేందుకు 'బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ' దోహదం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే, టిడిపి ఇన్‌ఛార్జీ మీనాక్షి నాయుడు తెలిపారు. మంగళవారం మండలంలోని నాగలాపురం గ్రామంలో 'బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ' నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలకు టిడిపి ప్రవేశపెట్టిన మినీ మేనిఫెస్టోలోని అంశాలపై అవగాహన కల్పించారు. గ్రామస్తులకు ష్యూరిటీ బాండ్లను అందజేశారు. గ్రామాల్లోని బూత్‌ ఇన్‌ఛార్జీల ఇంటికి వెళ్లి టిడిపి మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించి, ప్రతి కుటుంబం సమాచారాన్ని టెలిగ్రామ్‌ బాట్‌లో అప్‌డేట్‌ చేయాలని సూచించారు. టిడిపి మండల నాయకులు రామస్వామి, ఆరేకల్‌ రామకృష్ణ, రంగన్న, లింగన్న, వెంకటేష్‌, నరసప్ప, ఉరుకుందు, రామలింగ, మల్లేష్‌ పాల్గొన్నారు.