ప్రజాశక్తి : నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని ఏపీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరిగాయి. సోమవారం అంగన్వాడీలు అఖిలభారత అంగన్వాడీ కోర్కెల దినం సందర్భంగా ఐసిడిఎస్ ఆఫీసుల వద్ద ధర్నా నిర్వహించి, అధికారులకు వినతులు అందించారు. సమాజంలో మాతా-శిశు మరణాలు తగ్గించడానికి, పిల్లలు బడికి అలవాటు చేయడానికి అనుబంధ పౌష్టిక ఆహారాన్ని అందించడంలో అంగన్వాడి సెంటర్లు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. దేశవ్యాప్తంగా పేద గర్భిణీ బాలింతలకు, చిన్న పిల్లలకు అనేక సేవలు అందిస్తున్న అంగన్వాడీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని మండిపడ్డారు. మన రాష్ట్రంలో ఐసిడిఎస్ లక్ష్యానికి విరుద్ధంగా అంగన్వాడి సెంటర్ లో కొన్ని ప్రాథమిక పాఠశాలలో కలపడం, అంగన్వాడి సెంటర్ లో pp1, pp2, ప్రిపరేటరీ ఫ్రీ ప్రైమరీ స్కూల్లో ఒకటి,రెండు తరగతులకు కలిసి ఫౌండేషన్ విద్యగా మార్చాలని నిర్ణయించారని తెలిపారు. ఇది ప్రీ స్కూల్లో పిల్లలకు, లబ్ధిదారులకు, అంగన్వాడీలకు నష్టదాయకమైన చర్య అని అన్నారు. వెంటనే నూతన విద్యా విధానంపై ఇచ్చిన 172 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా
1. అంగన్వాడి ఐసిడిఎస్ ను బలోపేతం చేయాలి.
2. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి.
3. హెల్పర్ లకు మినీ వర్కర్లకు ప్రమోషన్లు ఇవ్వాలి. సంక్షేమ పథకాలు వర్తింపచేయాలి.
4. రాజకీయ జోక్యాన్ని, సచివాలయ మహిళా పోలీసులు వేధింపులు అరికట్టాలి.
5. కనీస వేతనం రూ.21000, రిటైర్మెంట్ బెనిఫిట్స్ సౌకర్యం కల్పించాలని
6. లబ్ధిదారులకు నాణ్యమైన ఆహారాన్ని అందించి మేనో ఛార్జీలు పెంచాలి.
7. పోషణ ట్రాకర్ యాప్ ను రద్దు చేయాలి. ఇళ్ళ స్థలాలు ఇవ్వాలి.... వంటి న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారి డిమాండ్లను వెంటనే పరిష్కరించి అమలు చేయాలని లేని పక్షమున పెద్ద ఎత్తున పోరాటం ఉధృతం చేస్తామని తెలియజేశారు.



















