ప్రజాశక్తి -ఉలవపాడు : మండలంలోని కరేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధా నోపాధ్యాయులు ఆవుల శ్రీనివాసరావు తెలిపారు. ఇటీవల శింగరాయకొండలో జరిగిన జిల్లాస్థాయి స్కూల్ గేమ్స్ అండర్ 14, 17 బాల, బాలికల ఎంపిక పోటీల్లో పాఠశాలలో 10వ తరగతి చద్నుతున్న కాటం దుర్గారావు, చేవురి తిరుపతయ్య, 9వ తరగతి చదువుతున్న కటారి తేజ అండర్ 17 బాలుర విభాగంలో జిల్లా జట్టుకు ఎంపికైనట్లు పాఠశాల ఫిజికల్ డైరక్టర్ ఓగుబోయిన శ్రీనివాసులు చెప్పారు. వీరు ఈ నెల 20వ తేదీ నుండి 22తేదీ వరకు కర్నూల్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారు. ఎంపికైన విద్యార్థులను పాఠశాల సిబ్బంది, పాఠశాల పేరెంట్స్ కమిటీ ఛైర్మన్ బొడ్డు శ్రీధర్ రెడ్డి, గ్రామస్తులు అభినందించారు.










