Jan 13,2023 21:55

విద్యార్థులను అభినందిస్తున్న ఎమ్మెల్యే

ప్రజాశక్తి - కదిరి టౌన్‌ : రాష్ట్ర 66 వ స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ స్క్త్య్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ పోటీల్లో కదిరి విద్యార్థులు సత్తా చాటారు. నెల్లూరు ఎసి. సుబ్బారెడ్డి స్టేడియంలో జరిగిన పోటీలలో 23 వ జాతీయ స్థాయి స్క్త్య్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో జమ్మూ లో జరిగిన జాతీయ పోటీలలో కదిరి విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచి మెడల్స్‌ సాధించారు మెడల్స్‌ సాధించిన విద్యార్థులకు, మాస్టర్‌ షాకిర్‌ కి ఎమ్మెల్యే. పి.వి.సిద్ధారెడ్డి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మెడల్స్‌ను, ప్రశంసా పత్రాలను విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ రాజశేఖర్‌ రెడ్డి, ఎస్‌కె.వలి తదితరులు పాల్గొన్నారు.