Jan 30,2023 19:01

ఎంపికైన విద్యార్థులు

ప్రజాశక్తి -కందుకూరు : ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎపి సిఎం కప్‌ స్త్రీ పురుషుల బాస్కెట్‌ బాల్‌ జట్ల ఎంపిక సోమవారం కందుకూరులో జరిగింది. ఈ ఎంపికకు జిల్లా వ్యాప్తంగా సుమారు 50 మంది బాల, బాలికలు హాజరయ్యారు. ఎంపికైన జట్టు త్వరలో జరిగే సీఎం కప్‌ రాష్ట్ర స్థాయి ఛాంపియన్‌ షిప్‌లో పాల్గొంటాయి. ఎంపికను జిల్లా స్పోర్ట్స్‌ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా బాస్కెట్‌ బాల్‌ అసోసియేషన్‌ సహకారంతో జరిగింది. బాస్కెట్‌ బాల్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ కంచర్ల రామయ్య పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొని ప్రకాశం జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. జిల్లా అసోసియేషన్‌ సెక్రటరీ టి సుబ్బారావు, ఈసీ నెంబర్‌ సయ్యద్‌ జిల్లాని, బార్సు హై స్కూల్‌ పిడి శ్రీనివాసరావు, పోన్నలూరు పిడి చిరజీవి రెడ్డి పాల్గొన్నారు.
పురుషుల జట్టుకు ఎంపికైన వారు వీరే
కందుకూరుకు చెందిన సిహెచ్‌ హేమంత్‌ ,జి హరికష్ణ, ఎన్‌ సందీప్‌, టి మోహన్‌ చందు, కే వెంకటేష్‌ ,పి విష్ణువర్ధన్‌, జె జోసెఫ్‌, కే ఏసుబాబు, ఒంగోలు ఐఐటి కాలేజీ కు చెందిన ఆర్‌ గణేష్‌ ,డి హేమంత్‌ ,దర్శికి చెందిన పి పవన్‌ కుమార్‌ రెడ్డి ,పొన్నలూరు కు చెందిన జి మన్మధరావు ఎంపికయ్యారు.
బాలికల జట్టుకు ఎంపికైన సభ్యులు వీరే..
కందుకూరు టిఆర్‌ఆర్‌ కళాశాలకు చెందిన పి సుష్మ గాయత్రి, ఈ కౌసల్య ,పి శాంతి ,డి హరిత ,కే స్రవంతి, ఎం కల్పన ,పొన్నలూరు కు చెందిన సిహెచ్‌ వైష్ణవి ,డి ఆమని, కేజీబీవీ కి చెందిన కే చిట్టెమ్మ, కే వైష్ణవి, మంజుష ఉన్నారు.