గోడపత్రికలు ఆవిష్కరిస్తున్న నాయకులు, కార్మికులు
పెనుకొండ : అనంతపురంలో ఈనెల 20 నుంచి 22వరకు జరిగే మున్సిపల్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్ కోరారు. ఆదివారం స్థానిక నగర పంచాయతీ కార్యాలయం ముందు జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మహాసభలకు సంబందించిన గోడపత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై రాష్ట్ర మహాసభల్లో చర్చించి భవిష్యత్ కార్యక్రమం రూపొందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిన్న వెంకటేష్, రిక్షా నరసింహులు, ఇ.వెంకటేష్, ముత్యాలు, గంగరత్నమ్మ, నాగమ్మ, శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.










