Jan 02,2023 09:49

రాష్ట్ర మహాసభలకు వెళ్తున్న సిఐటియు నాయకులు

         పెనుకొండ : భీమవరంలో జరిగే 14వ సిఐటియు రాష్ట్ర మహాసభల్లో పాల్గొనేందుకు పెనుకొండ రైల్వే స్టేషన్‌ నుంచి సత్యసాయి జిల్లా సిఐటియు నాయకులు ఆదివారం వెళ్లారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు జడ్పీ శ్రీనివాసు లు, ప్రధాన కార్యదర్శి ఈఎస్‌.వెంకటేష్‌, జిల్లా కార్యదర్శులు రమేష్‌, లక్ష్మీనారాయణ, బాబా, సాంబ, జిల్లా ఉపాధ్యక్షులు ఇంతియాజ్‌, నరసింహులు, దిల్షాద్‌, శ్రీదేవి, సౌభాగ్య, రఫీ, నారాయణ నాయకులు వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల సమస్యలపై మహాసభలో భవిష్యత్తు కర్తవ్యాలు చర్చించబోతున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక విధానాలకు వ్యతిరేకంగా పోరాటలు నిర్వహించనున్నట్లు చెప్పారు.