Dec 15,2022 21:54

పోస్టర్లు విడుదల చేస్తున్న నాయకులు

కదిరి టౌన్‌ : ఈనెల 20 నుంచి 22 వరకు అనంతపురంలో నిర్వహించే సిఐటియు అనుబంధం మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర మహాసభల పోస్టర్లను స్థానిక నాయకులు గురువారం ఆవిష్కరించారు. ఈసందర్భంగా సిఐటియు మున్సిపల్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షుడు జిఎల్‌. నరసింహులు, లక్ష్మీనారాయణ తదితరులు స్థానిక నాయకులతో కలిసి పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర మహాసభలకు పెద్ద ఎత్తున కార్మికులు ప్రజలు వివిధ రంగాల వారు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో నాయకులు రమణ, జె. జనార్దన్‌, ఎస్‌. తిరుపాలు, బాలకృష్ణ, చెన్నకృష్ణ, రాజు, కృష్ణకుమార్‌, రాజేష్‌, నరసింహ, రామాంజులు. సూరి, నరసింహ మూర్తి, చంద్రప్ప తదితరులు పాల్గొన్నారు