Apr 16,2022 16:29

ప్రజాశక్తి-జగ్గయ్యపేట రూరల్ : ఎన్టీఆర్ మున్సిపల్ స్విమ్మింగ్ పూల్ లో నేడు నిర్వహించనున్న 5వ రాష్ట్ర మాస్టర్స్ స్విమ్మింగ్ చాంపియన్ షిప్ ఈత పోటీలలో జగ్గయ్య పేట నుండి 15 మహిళలు, 15 పురుషులు మొత్తం 30 కూడిన జట్టు ఛాంపియన్ షిప్ లక్ష్యంగా పాల్గొంటుంది. ఈత కోచ్ పొట్టా బత్తిన పాండురంగారావు, లక్ష్మి దంపతులకు, సభ్యులకు, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, కేడిసిసి చైర్మన్ తన్నీరు  నాగేశ్వరరావు, డ్రీమర్స్ స్విమ్మింగ్ అసోసియేషన్, కృష్ణ స్విమ్మర్స్ అసోసియేషన్ ప్రతినిధులు శుభాకాంక్షలు తెలియపరిచారు.