Oct 06,2022 22:36

ప్రజాశక్తి-తిరువూరు: ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తిరువూరు మండలంలోని గానుగపాడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, రచయిత, జెవివి ప్రతినిధి ఎం.రాంప్రదీప్‌ను విద్యార్థి వికాస వాహిని సంస్థ ఘనంగా సన్మానించింది. స్వచ్ఛంద బడిబాట కార్యక్రమం ద్వారా గత 13 ఏళ్లుగా వంద మందికిపైగా బడి బయటి పిల్లలని గుర్తించి వివిధ ప్రభుత్వ బడుల్లో చేర్పించిన రాంప్రదీప్‌ను విజయవాడలోని సర్వోత్తమ గ్రంథాలయంలో బుధవారం రాత్రి నిర్వహించిన కార్యక్రమంలో మాజీ డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధప్రసాద్‌ సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి వి.కేశవరావు తదితరులు పాల్గొన్నారు.