Jan 24,2023 18:43

సంతాప సభలో మాట్లాడుతున్న అధ్యాపకులు

ప్రజాశక్తి -వెంకటాచలం :విక్రమ సింహపురి యూనివర్సిటీ కావలి కళాశాలలో ఫిజిక్స్‌ విభాగంలో పనిచేస్తున్న ఆచార్య రాము అకాల మరణం బాధాకరమని పలువురు విచారం వ్యక్తం చేశారు. కాకు టూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీలో అధ్యాపక, అధ్యా పకేతరులు, విద్యార్థుల ఆధ్వర్యంలో మంళవారం సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య సుందరవల్లి మాట్లాడుతూ ఆచార్య రాము దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతూ చివరి వరకు విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ నిరంతరం శ్రమించారన్నారు. అలాంటి నిబద్ధత కలిగిన ఆచార్యుడిని కోల్పోవడం బాధాకరమన్నారు. ఆయన కుటుంబానికి అందాల్సిన అన్ని ప్రయోజనాలను వీలైనంత త్వరగా వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం పలువురు అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది రాము సేవలను కొనియాడారు. ఆచార్య రామచంద్ర రెడ్డి కళాశాల ప్రిన్సిపల్‌ ఆచార్య విజయా నంద కుమార్‌ బాబు ఉన్నారు