Dec 17,2022 21:17

సమావేశంలో మాట్లాడుతున్న న్యాయమూర్తి స్పందన

       హిందూపురం : భారత రాజ్యాంగం ఎంతో పవిత్రమైనదని, దాని స్ఫూర్తిని చాటి చెప్పాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందని స్థానిక జూనియర్‌ సివిల్‌ జడ్జి స్పందన సూచించారు. మైనార్టీ దినోత్సవాన్ని పురష్కరించుకుని శనివారం స్థానిక అజీజియా ఉర్దూ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు పాండురంగ నాయకులు అధ్యక్షతన విద్యార్థులకు భారత రాజ్యాంగంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి స్పందన మాట్లాడుతూ డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ భారత రచించిన రాజ్యాంగం ద్వారా అందరికీ సమాన హక్కులు లభించాయన్నారు. విద్యార్థులు ఈ విషయాలను గుర్తెరిగి ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలన్నారు. దీంతో పాటు చట్టాలపైనా అవగాహన పెంచుకోవాలని సూచించారు. చట్టాలపై అవగాహన పెంచుకుంటే రాజ్యాంగంలో ఉన్న విషయాలు అర్థం చేసుకోవాడానికి సాధ్యం అవుతుందన్నారు. గొప్ప వ్యక్తులను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏపీపీ ఇందాద్‌, ఏజీపీ శ్రీనివాస్‌ రెడ్డి, న్యాయవాదులు సిద్ధు, నవేరా, లోక్‌ అదాలత్‌ సిబ్బంది శారద పాల్గొన్నారు.