Nov 08,2023 15:10

సమావేశంలో మాట్లాడుతున్న శ్రీనివాసరావు

ప్రజాశక్తి - ప్రత్తిపాడు
ఒటర్ల నమోదుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి ఎ.శ్రీనివాసరావు కోరారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో మంగళవారం ఆయన సమావేశం నిర్వహించారు. డిసెంబరు 2, 3 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలు నిర్వహిస్తామన్నారు. అర్హులందరూ ఓటు నమోదు చేసుకోవాలన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు తప్పనిసరిగా బూత్‌ లెవెల్‌ ఏజెంట్లను నియమించుకోవాలన్నారు. కొత్తగా ఓటు నమోదు చేసుకునే వారిని గుర్తించి బూత్‌ లెవెల్‌ అధికారులకు తెలియజేయాలని కోరారు. బూత్‌ లెవెల్‌ ఏజెంట్స్‌ పోలింగ్‌ కేంద్రాల వద్ద ఉండి సరియైన ఓటర్ల జాబితా తయారీకి సహకరించాలని కోరారు. డిసెంబర్‌ 9 వరకు కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ జరుగుతుందని, ప్రతి గ్రామంలో 100శాతం నమోదు జరిగేలా అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్లు వీరవెంకటగోపాలకష్ణ, భీమారావు, ప్రసాద్‌, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.