Jan 07,2023 21:48

ఫొటో : మాట్లాడుతున్న అంబేద్కర్‌ సేవాదళ్‌ మండల అధ్యక్షుడు బత్తుల రవిచంద్ర

రాజకీయ దౌర్జన్యానికి దళితులు బలి
ప్రజాశక్తి-బిట్రగుంట : రాష్ట్రంలో రాజకీయ నాయకుల చేతిలో రాజకీయ దౌర్జన్యానికి దళితులు బలైపోతున్నారని బోగోలు మండల అంబేద్కర్‌ సేవాదళ్‌ అధ్యక్షుడు బత్తుల రవిచంద్ర పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ దౌర్జన్యాలకు దళితులు ఎక్కువగా ఇబ్బందులకు గురవుతున్నారని, మొన్న ముసునూరులో కరుణాకర్‌, నిన్న కడనూతలలో పైడి హర్ష, దగదర్తిలో తేజ, గుంటూరులో దళిత మహిళ విజయవాడలో దళిత మహిళపై అత్యాచారాలు మానభంగాలు దౌర్జన్యాలు జరుగుతున్నాయన్నారు.
దళితులు రాజకీయ నాయకుల చేతుల్లో నలిగి పోతున్నారని తెలిపారు. దగదర్తి మండలం ఉలవపాళ్ల పెట్రోల్‌ బంక్‌ వద్ద తేజపై జరిగిన దౌర్జన్యాన్ని నిరసిస్తూ నిందితుడిపై 307 కేసు నమోదు చేయాలని దళిత సంఘాలు పిలుపుమేరకు సోమవారం కావలి అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమానికి దళితులందరూ పాల్గొనాలన్నారు.