సమావేశంలో మాట్లాడుతున్న జెడిఎ
చిలమత్తూరు : రాగిపంట సాగుకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహం అందిస్తోందని జెడిఎ సుబ్బారావు అన్నారు. ఈ మేరకు చిలమత్తూరు రైతు భరోసా కేంద్రంలో బుధవారం రైతులకు రాగిపంటసాగుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జెడిఎ మాట్లాడుతూ ప్రభుత్వం విత్తనాలు 50 శాతం సబ్సీడీతో అందజేస్తుందని,పండిన పంటను సివిల్ సప్లే ద్వార మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులకు ప్రోత్సాహం అందిస్తుందని దీనిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎడిఎ అల్తాప్ అలీఖాన్, మండల వ్యవసాయశాఖ అధికారి వంశీకృష్ణ, తహశీల్దార్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.










