Punjab vs delhi : యుపి, బీహార్ 'భయ్యాలు'.... కేజ్రీవాల్‌పై చన్నీ కౌంటర్ ఎటాక్
చండీఘర్ : పంజాబ్‌ను ఏలేందుకు ఉత్తరప్రదేశ్, బీహార్ 'భయ్యాలు' వస్తున్నారంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ చన్నీ వ్యాఖ్యలతో ప్రతిపక్షాలు విమర్శలు సంధించాయి. దీంతో ఆయన కౌంటర్ ఎటాక్‌కు దిగారు. మాజీ పార్టీ నేత కుమార్ విశ్వాస్ వ్యాఖ్యలనుద్దేశించి ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు ఝలక్‌నిచ్చేందుకు ప్రయత్నాలు చేపట్టారు. కేజ్రీవాల్ పంజాబ్ ముఖ్యమంత్రిగా అదేవిధంగా స్వతంత్ర దేశానికి (ఖలిస్తాన్)కు ప్రధాన మంత్రి కావాలనుకుంటున్నారంటూ.. ఆయనపై పరోక్షంగా కుమార్ విశ్వాస్ చేసిన వ్యాఖ్యలను ప్రసారం చేయడాన్ని నిరోధిస్తూ మీడియా ఎన్నికల సంఘాన్ని ఆదేశించించగా.. వాటిని తాజాగా తొలగించింది. దీనిపై స్పందించిన చన్నీ... విశ్వాస్ వ్యాఖ్యలపై విచారణ జరపాలని ప్రధాని మోడీని కోరారు. దీంతో కేజ్రీవాల్ ఇరుకున పడినట్లయింది. 'రాజకీయాలను పక్కన పెడితే.. వేర్పాటు వాద పోరాడంలో పంజాబ్ ప్రజలు భారీ మూల్యాన్ని చెల్లించుకున్నారు. గౌరవనీయులైన ప్రధాని.. పంజాబ్ ఆందోళనను పరిష్కరించాల్సి ఉంది' అని మోడీని కోరారు. పంజాబ్, యుపి ఎన్నికల నేపథ్యంలో కేజ్రీవాల్ రాజకీయ ప్రత్యర్థులకు విశ్వాస్ వ్యాఖ్యలు.. ఓ టపాసులా దొరికాయి. కేజ్రీవాల్ అధికార దాహంతో ఉన్నాడంటూ విశ్వాస్ వ్యాఖ్యానించిన సంగతి విదితమే.










