Oct 15,2022 15:27

 ప్రజాశక్తి-విజయవాడ : నున్న సాంఘీక సంక్షేమశాఖ బాలికల హాస్టల్ వార్డెన్ దళిత మహిళ పి లక్ష్మిని కులం పేరుతో దూషించి, లైంగిక వేధింపులకు పాల్పడిన విజయవాడ ఇన్ చార్జ్ ASWO గోపాలకృష్ణను, అతనికి సహకరించిన వంట మనిషి నాగేశ్వరిని తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరుతూ విజయవాడ ధర్నా చౌక్ వద్ద కెవిపిఎస్, ఐద్వా, ఎస్.ఎఫ్.ఐ, దళిత ప్రజాసంఘాలు నిరసన తెలిపారు.  జిల్లా సాంఘీక సంక్షేమశాఖ అధికారులు ముద్దాయిలపై కాకుండ బాధిత మహిళకు షోకాజ్ నోటీసు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. ఇవన్నీ పరిశీలన చెయ్యకుండ జిల్లా అధికారులు ఇచ్చిన తప్పుడు రిపోర్ట్ అసరా తీసుకుని కలెక్టర్ బాధిత మహిళను వార్డెన్ లక్ష్మిని గోపాలకృష్ణ గతంలో పనిచేసిన ప్రాంతానికి బదిలీ చెయ్యడం సరైంది కాదన్నారు. ఈ విషయంపై కలెక్టర్  పునరాలోచన చెయ్యాలిసిన అవసరం ఉందన్నారు. ఈ విషయంపై చర్య తీసుకోవాలని ఎస్ సి కమీషన్ ఛైర్మన్ రాష్ట్ర సాంఘీక సంక్షేమశాఖ కమీషన్ కి ఆదేశాలు జారీ చేశారు. ఈ నిరసనలో పాల్గొన్న కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (KVPS) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి , జిల్లా కార్యదర్శి జి నటరాజు , నాయకులు నర్సింహారావు, ఐద్వా జిల్లా కార్యదర్శి కె శ్రీదేవి , నాయకులు గడ్డం ఝాన్సీ , గాదె ఆదిలక్ష్మి , ఆశా , షకీలా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సోమేశ్వర్రావు , వెంకటేశ్వరరావు , దళిత ప్రజాసంఘాల నాయకులు గణేష్ , డాక్టర్ అంకయ్య , కనకరాజు తదితరులు పాల్గొన్నారు.