ప్రజాశక్తి-కోవూరు : కోవూరు బజార్ సెంటర్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు ప్రైవేటేకరణ వ్యతిరేకిస్తూ రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గండవరపు శేషయ్య మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజల ఆస్తులను కారు చౌకగా కార్పొరేట్ సంస్థలకు అమ్మడం దారుణం అన్నారు. అందులో భాగంగానే విశాఖకు బ్రిడ్జ్లు ప్రతిపాదన ముందుకు తీసుకువచ్చారని అదేవిధంగా విశాఖ ఉక్కు ఉద్యోగులు కార్మికులు 810 రోజులుగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన కొనసాగిస్తుంటే కేంద్రం పట్టించుకోకపోవడం సిగ్గుచేటు అన్నారు కేంద్రంలోని బిజెపి అధికారంలోకి వచ్చాక రైల్వే ఇన్సూరెన్స్. ఓడరేవులు ఎయిర్పోర్ట్ లు. రిటైల్రగంలోకి అడుగుపెట్టే విధంగా మోడీ వైఖరి కొనసాగుతున్నదని జీఎస్టీ పేరుతో ప్రజలపై మోయలేని భారాలు మోపుతూ పాలు దగ్గర నుండి స్మశాన వాటిక దాకా ప్రజల ముక్కుల పిండి వసూలు చేస్తున్నారని అదేవిధంగా మన రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలు ప్రత్యేక హోదా మాట ఊసే లేదని. మన రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు. వ్యక్తిగత స్వార్థాలతో రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు గాలికి వదిలి.మోడీ కాళ్లు మొక్కుతున్నా రని. రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ప్రజల ప్రయోజనాల కోసం ఐక్యంగా ఉద్యమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జి బుజ్జన్న. బి పెద్దన్న. జి సురేష్. పి సురేంద్ర. వి భాస్కర్. షేక్ ఖాదర్ బాషా. వి రత్నమ్మ. షేక్ హామీదా. టీ లీలమ్మ. షేక్ అఫ్రోజ్. షేక్ కాలేషా. వి మణి.వెంకటేశ్వర్లు. మస్తానయ్య. షేక్ ఖాదర్ బాషా. షేక్ జాన్ బాషా. ఎన్ మోహన్. ఈగ హరి తదితరులు పాల్గొన్నారు










