ప్రజాశక్తి-రాజంపేట అర్బన్: రాజంపేట శాసనసభ్యులు మేడా వెంకట మల్లికార్జున రెడ్డికి వ్యతిరేకంగా మంగళవారం రాజంపేట పట్టణంలో వెలసిన పోస్టర్ల వివాదంలో పట్టణ పోలీసులు ముగ్గురిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. పదవ వార్డు కౌన్సిలర్ సూరి, వర్ధిబోయిన బాబు, బిల్లా నరేష్ లపై బైండోవర్ నమోదు కాగా సినిమా పోస్టర్లు అంటించే మన్నూరుకు చెందిన పోలీచర్ల కుమార్ అనే యువకుడిని మంగళవారం రాత్రే అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించినట్లు సమాచారం. మా నమ్మకం నువ్వే జగనన్న.. కానీ రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డి.. మీ మీద మాకు నమ్మకం లేదు., ఇట్లు మోసపోయిన వైఎస్ఆర్సిపి నాయకులు మరియు కార్యకర్తలు అని సంబోధిస్తూ మంగళవారం పట్టణంలోని పలు ప్రాంతాలలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గోడలకు పోస్టర్లు అంటించిన విషయం విధితమే.! చిలికి చిలికి గాలి వానలా ఈ వివాదం ఎటువైపు దారితీస్తుందో వేచి చూడాలి.










