Oct 06,2023 11:18

ప్రజాశక్తి-పాలకొల్లు : ఈరోజు విజయవాడ చేరుకున్న నారా లోకేష్ ను కలవడానికి విజయవాడ వెళుతున్న ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును పట్టణ పోలీసులు పాలకొల్లులో అడ్డుకున్నారు. ఈమేరకు పట్టణ ఎస్ఐ ముత్యాలరావు సిబ్బంది ఎమ్మెల్యే కారు మీద వెళుతుండగా ఆయన నివాసం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. 'ఇదేమిటి మనం ఎక్కడ ఉన్నాం, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ లకు వెళ్ళడం లేదు కదా.. కనీసం రాష్ట్రంలోని ఎమ్మెల్యే విజయవాడ, రాజమండ్రి వెళ్ళే అర్హత లేదా' అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు వైసిపీకి తగిన విధంగా బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు.