కొత్తచెరువు : ఫ్యాప్టో శ్రీసత్యసాయి జిల్లా నూతన కార్యవర్గ కమిటీని ఎన్నుకున్నట్లు ఎన్నికల పరిశీలకులు హృదయరాజు తెలిపారు. శనివారం శ్రీసత్యసాయి జిల్లా ఫ్యాప్టో కార్యవర్గ సమావేశం కొత్తచెరువు బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్నికల పరిశీలకులుగా జి.హృదయరాజు హాజరై ఎన్నిక నిర్వహించారు. ఫ్యాప్టో శ్రీసత్యసాయి జిల్లా ఛైర్మన్‌గా ఎపిటిఎఫ్ కోడూరు శ్రీనివాసులు, సెక్రటరీ జనరల్‌గా జి.రామకృష్ణ, డిప్యూటీ సెక్రటరీ జనరల్‌గా యుటిఎఫ్ కె.నాగేంద్ర, ఎగ్జిక్యూటీవ్ మెంబర్‌గా యుటిఎఫ్ ఎస్.జయచంద్రారెడ్డి, ఎస్‌టియు జి.రామ్మోహన్, ఎపిటిఎఫ్ 1938 బి.హరిప్రసాద్, కార్యదర్శులుగా హెచ్‌ఎంఎ సురేష్‌బాబు, ఆప్టా వెంకటనాయుడు, ఎపిఆర్‌ఇఐటిఏ బి.చెన్నయ్యలను ఎన్నుకన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో నాయకులు అశోక్‌కుమార్, ఫైరోజ్ అహ్మద్, బికె.ముత్యాలప్ప, పివి.మాధవ, సాయిశివ, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.










