ప్రజాశక్తి -ఇబ్రహీంపట్నం
ఇబ్రహీంపట్నంలోని నిమ్రా ఆసుపత్రిలో మంగళవారం ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్‌పై ఆరోగ్య సిబ్బందికి శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్ర మంలో ఇమ్యూనైజేషన్ జాయింట్ డైరెక్టర్ అర్జునరావు, ఎన్‌టిఆర్ జిల్లా కలెక్టర్ డిల్లీరావు, డిఎమ్‌హెచ్‌ఓ సుహసిని హజరయ్యారు. ఈ సందర్భంగా డిఎమ్‌హెచ్‌ఓ సుహసిని మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15 నుండి ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమలు చేయనున్నట్లు ఇందులో భాగంగా నిమ్రాలో వైద్య సిబ్బందికి శిక్షణా తరగతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి గ్రామానికి నెలలో రెండుసార్లు 104 అంబులెన్స్ ద్వారా అందజేయనున్నట్లు తెలియజేశారు. ప్రతి ఎమ్‌ఎల్‌పిహెచ్‌సి సెంటర్ల పరిధిలో ప్రస్తుతం 67రకాల మందులు 14 డయాగస్టిక్ సెంటర్లు ఉన్నట్లు తెలియజేశారు. జిల్లా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్యాన్ని దగ్గర చేయడమే ఈ కార్యక్రమ లక్ష్యమని అన్నారు. ఆశావర్కర్, ఏఎన్‌ఎం, ఎంఎల్‌హెచ్‌పిలకు అవగాహన కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 16 మండలా లలోని ఆరోగ్య కార్యకర్తలకు మొదటిరోజు 690 మందికి శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. రెండోరోజు కార్యక్రమంలో భాగంగా 285 మంది అంగన్‌వాడీ టీచర్ మరియు సూపర్‌వైజర్లకు శిక్షణా అందించనున్నట్లు వివరించారు. ఈ కాన్సెప్ట్‌ను గ్రామీణ ప్రాంతాలలో విసృతంగా తీసుకువెళ్ళేందుకు కావలసిన మెడికల్ మెబైల్ ఆఫీసర్ ట్యాగింగ్ చేసి ఆగస్టు15 నుండి పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసేందుకు గాను శిక్షణా కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ కాన్సెప్ట్‌ను గ్రామీణ ప్రజలు స్వాగతిం చాలని కోరారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు మరియు సిబ్బంది నిమ్రా మేనేజ్‌మెంట్ పాల్గొన్నారు.










