Apr 11,2023 20:40

ఫూలే విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న ఎంఎల్‌ఎ అనిల్‌కుమార్‌

ఫూలే విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న ఎంఎల్‌ఎ అనిల్‌కుమార్‌
ఫూలేను ఆదర్శంగా తీసుకోవాలి
నెల్లూరు:మహాత్మా జ్యోతిబా పూలే 197వ జయంతిని పురస్కరించుకుని మంగళవారం నగరంలోని మినీ బైపాస్‌ రోడ్డులో గల మహాత్మా జ్యోతి బా పూలే గారి విగ్రహానికి జిల్లా పరిషత్‌ ఛైర్‌ పర్సన్‌ ఆనం అరుణమ్మ, జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ శ్రీ ఆర్‌. కూర్మనాథ్‌, మాజీమంత్రి, నగర శాసన సభ్యులు డా. అనీల్‌ కుమార్‌, జిల్లా అధికారులు, వివిధ బి.సి సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
సంఘ సంస్కర్తగా, సమ సమాజ స్థాపనకు మహాత్మా జ్యోతి బా పూలే చేసిన కషిని ఈ సందర్భంగా వారు కొనియాడారు.