నివాళులర్పిస్తున్న మంత్రి కాకాణి
ఫూలే సేవలు మరువరానివి
మంత్రి క్యాంపు కార్యాలయంలో
నెల్లూరు:గొప్ప దార్శనికుడు, సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కషిచేసిన మహనీయుడు జ్యోతిబా పూలే సేవలు చిరస్మరణీయమని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. మంగళవారం నగరంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జ్యోతిబా పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి మంత్రి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సమాజానికి ఆదర్శంగా నిలిచిన జ్యోతిబా పూలే ఆశయ సాధనకు మనమంతా కలిసి పనిచేయడానికి పునరంకితం కావాలని ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు. ఏప్రిల్ నెల ఎంతో విశిష్టమైనదని, ఈనెల 5వ తేదీ బాబు జగ్జీవన్ రామ్, 11న జ్యోతిబా పూలే, 14న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి మహనీయులు ఈ నెలలో జన్మించారని గుర్తు చేశారు. రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి ముఖ్యమంత్రి పెద్దపీట వేస్తున్నారని, ఈ క్రమంలోనే ఎస్‌సి, ఎస్ టి, బీసీ, మైనార్టీ వర్గాల్లో అట్టడుగు కులాల్లోని వారిని గుర్తించి రాజకీయంగా గుర్తింపు కల్పించడంతోపాటు ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి పదవులు కేటాయించిన ఘనత ముఖ్యమంత్రి కే దక్కిందన్నారు.










