Jul 17,2021 16:21

కాందహార్‌ : ఆఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు, దళాలకు మధ్య జరిగిన కాల్పుల్లో భారత్‌కు చెందిన ప్రముఖ ఫోటో జర్నలిస్ట్‌, పులిట్జర్‌ అవార్డ్‌ గ్రహీత డానీష్‌ సిద్ధిఖీ ప్రాణాలు కోల్పోవడంపై తాలిబన్లు స్పందించారు. ఆయన మృతికి తాము కారణం కాదంటూ స్పష్టం చేశారు. గత కొన్ని రోజులుగా ఆప్ఘనిస్తాన్‌లో తాలిబన్లు, భద్రతా దళాలకు మధ్య ఘర్షణలు నెలకొంటున్నాయి. వీటిని కవర్‌ చేసేందుకు సిద్ధిఖీ అక్కడకు వెళ్లారు. అక్కడ జరిగిన ఘర్షణల్లో ఆయనతో పాటు మరో సీనియర్‌ అధికారి కూడా చనిపయిన సంగతి విదితమే. దీనిపై స్పందించిన తాలిబన్లు వాస్తవానికి సిద్ధిఖీ ఎలా చనిపోయాడో కూడా తెలియదని పేర్కొన్నారు. ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు. జర్నలిస్టులు తమకు సమాచారం ఇవ్వకుండానే వార్‌ జోన్‌లోకి వచ్చారని తెలిపారు.