Mar 08,2023 21:41

మాట్లాడుతున్న ప్రొఫెసర్‌

మాట్లాడుతున్న ప్రొఫెసర్‌
ఫోరెన్సిక్‌ నిపుణులు డా.శశికాంత్‌ కు ప్రొఫెసర్‌ గా ఉద్యోగోన్నతి
నెల్లూరు:ఏసిఎస్‌ఆర్‌ ప్రభుత్వ వైద్యకళాశాలలో ఫోరెన్సిక్‌ నిపుణులు సేవలందిస్తున్న డా.శశికాంత్‌కు ఉద్యోగోన్నతి పై ప్రోఫెసర్‌ గా నియమించింది. మెడికల్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ కౌన్సిలింగ్‌ నిర్వహించి గుంటూరు జి జి హెచ్‌ ప్రొఫెసర్‌ గా నియమిస్తూ ఉత్తర్వూలు జారీ చేశారు. డా.శశికాంత్‌ ఏ.సి. సుబ్బారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గాను, కడప రిమ్స్‌ లో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ గాను సేవలందించి ఉన్నారు. ప్రస్తుతం ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు
.వత్తి పట్ల అంకిత భావం, విధి నిర్వహణలో రాజీలేని మనస్తత్వం, చిక్కుముడి వీడని ఎన్నో మిస్టరీ లను సవాల్‌ గా స్వీకరించడం, ఒత్తిళ్లకు లొంగని వ్యక్తిత్వం, అవినీతి కి ఆమడ దూరం పాటించే ముక్కుసూటి అధికారి గా డా.శశికాంత్‌ వ్యవహరిస్తారు. కొన్ని సంవత్సవరాల క్రితం నగరంలో అగ్నికి ఆహుతైన తమిళనాడు ఎక్స్‌ ప్రెస్‌ రైలు దుర్ఘటన లో 30 మంది ప్రయాణికులు మాంసపు ముద్దలు గా మారిపోయి ఏ మతదేహం ఎవరిదో పోల్చుకోలేని దయనీయ పరిస్థితులు అందరికీ తెలిసిందే. కనీసం మతదేహాలనైనా చూపాలని కోరుతూ బాధితుల బంధువులు పెట్టిన ఆర్తనాదాలు, రోదనలు నాడు కంటతడి పెట్టించాయి. ఆనాటి హదయ విదారక పరిస్థితులలో డా. శశికాంత్‌ తన అపార అనుభవం, నైపుణ్యత తో మతదేహాలను వేరు పరిచి బాధితులకు స్వాంతన చేకూర్చి మన్ననలు పొందారు. జిల్లాలో జరిగిన వరుస హత్యలు (సీరియల్‌ మర్డర్స్‌) , నక్సలైట్స్‌ మరణాలు, కొరకరాని కొయ్యలా మారిన దుత్తలూరు, తడ బస్సు హత్య కేసులను చాకచక్యంగా ఛేదించి దోషులకు కఠిన శిక్షలు పడేలా కీలకంగా వ్యవహరించారు. పోలీసు, న్యాయ వ్యవస్థలకు సహకరించారు.కేంద్ర మంత్రిత్వ హౌం శాఖ న్యూఢిల్లీ, నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ, డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ సర్వీసెస్‌ సంయుక్తంగా నిర్వహించిన కాంపిటీషన్‌ లో దేశవ్యాప్తంగా చోటు దక్కించుకున్న రెండు ఆర్టికల్స్‌ శశికాంత్‌ నామినేట్‌ చేసినవే కావడం జిల్లాకు గర్వకారణం.దేశ, విదేశీ ప్రతినిధులతో ప్రతిష్టాత్మకంగా గుజరాత్‌ లో నిర్వహించిన 25వ జాతీయ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌(%A×ఖీూజ%), 2023 కు హాజరై ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ వైద్యశాల కు ప్రాతినిధ్యం వహించి నెల్లూరు కీర్తిని చాటారు.ఫోరెన్సిక్‌ విభాగంలో డా.శశికాంత్‌ అందించిన సేవలకు గాను స్వాతంత్ర, గణతంత్ర దినోత్సవ వేడుకలలో రాష్ట్ర ప్రభుత్వం పలు అవార్డులను బహూకరించింది.