రాయచోటి: జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో అందిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని ఎపి డెయిరీ డెవలప్‌మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్, జిల్లా స్పెషల్ ఆఫీసర్ అహ్మద్ బాబు తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని విసి హాలులో జగనన్నకు చెబుదాం, ప్రయారిటీ బిల్డింగ్స్, వేకెన్సీ పొజిషన్, గడప గడపకూ మన ప్రభుత్వం, హౌస్ సైట్స్, హౌసింగ్, నాడు-నేడు హెల్త్, నాడు-నేడు అంగన్‌వాడీ, నాడు-నేడు స్కూల్, రీ సర్వే, జగనన్న పాల వెల్లువ పలు అంశాలపై కలెక్టర్ గిరీషతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అహ్మద్‌బాబు మాట్లాడుతూ జగనన్నకు చెబుతాం ఇది చాలా ప్రతిష్ట్మాతకమైన కార్యక్రమన్నారు. ముఖ్యమంత్రి ఎంతో ప్రాధాన్యతతో ఈ కార్యక్రమం తీసుకొచ్చారన్నారు. 1902కి వచ్చే ఫిర్యాదుల విషయంలో అత్యంత శ్రద్ధ చూపాలన్నారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలన్నారు. జగనన్నకు చెబుతాం కార్యక్రమంలో పోలీస్ 58, ఎపిఎస్‌పిడిసిఎల్ 55, సర్వే సెటిల్మెంట్ 28, ఎంఎయుడి 27, సివిల్‌సప్లై 26, రూరల్ డెవలప్మెంట్ 17, విఎస్‌డబ్ల్యూఎస్ 10, రూరల్ వాటర్‌సప్లై 13, ట్రాన్స్‌పోర్ట్ 10, పశుసంవర్థక శాఖ 6, సెబ్ 5, ఉమెన్ అండ్ వెల్ఫేర్ 5, డిజేబుల్డ్ డిపార్ట్మెంట్ 5 ఫిర్యాదులు అందాయని వాటిపై ప్రాపరగా రిమార్క్ కాలంలో డీటెయిల్‌గా రాసి సమస్యను పరిష్కరించాలన్నారు. జగనన్నకు చెబుదాం అందిన ఫిర్యాదులపై సంబంధిత శాఖ జిల్లా అధికారులు కింది స్థాయి సిబ్బందితో సమీక్ష నిర్వహించాలన్నారు. ఆధార్ సీడింగ్, అకౌంట్ మిస్ మ్యాచ్ తదితర ఎర్రర్స్ వల్ల బిల్లులు ఎన్ని ఉన్నాయి, ఎన్ని రోజుల నుంచి రాలేదు వంటి వివరాలను అడిగి తెలుసుకుని అటువంటి ఎర్రర్స్ ను త్వరగా క్లియర్ చేసి సకాలంలో బిల్లులు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. హౌసింగ్‌లో క్షేత్ర స్థాయి సిబ్బంది అవినీతికి పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. ల్యాండ్ సమస్యల మీద కూడా ప్రత్యేక దష్టి పెట్టి పరిష్కరించాలని ఆర్డీఓలను ఆదేశించారు. గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా పరిష్కరించాలని ఆర్డబ్ల్యూఎస్ ఎస్‌ఈని ఆదేశించారు. జిల్లాలో రీసర్వేను పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. రీసర్వే మొదట విడతలో చేసినవి ఏవి కూడా పెండింగ్లో పెట్టుకోవద్దన్నారు. ఇళ్ల నిర్మాణం వేగవంతానికి కషి చేయాలని హౌసింగ్ పీడీని ఆదేశించారు. జిల్లాలో జగనన్న పాల వెల్లువ అన్ని గ్రామాలు కవర్ కావాలన్నారు. త్వరగా మ్యాపింగ్, సర్వే పూర్తి చేయాలన్నారు. ఫేజ్ వన్, పేజ్ 2 చాలా బాగా పనిచేశారని, ఫేజ్‌త్రీలో అధికారులు సరిగా పనిచేయటం లేదన్నారు. ఇప్పుడు సేకరిస్తున్న పాల సేకరణ కన్నా మరింత గణనీయంగా పాల సేకరణ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏఎంసీయులు అన్నీ కూడా వర్కింగ్ లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్‌ను ప్రతి ఒక్కరు కూడా అచిప్ కావాలన్నారు. రెగ్యులర్‌గా జిల్లాకు వస్తా ఉంటానని, వెనకబడితే మాత్రం సహించేది లేదన్నారు.అంతకుముందు కలెక్టర్ మాట్లాడుతూ మే 9 నుంచి 25వ తేదీ వరకు జగనన్నకు చెబుదాం 827 ఫిర్యాదులు వచ్చాయని, 50.66 శాతం ఫిర్యాదులను పరిష్కరించడం జరిగిందన్నారు. ఇంకా 49.33 శాతం ఫిర్యాదులు పరిష్కరిస్తున్నామన్నారు. జగనన్నకు చెబుదాం ఫిర్యాదులు పరిష్కారంలో అన్నమయ్య జిల్లా రాష్ట్రంలో 6వ స్థానంలో ఉందన్నారు. జగనన్నకు చెబుదాం స్పందన పిఎంయు టీం జిల్లాస్థాయి, డివిజన్, మండల స్థాయిలో అధికారులను నియమించి పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. గ్రామ సచివాలయం బిల్డింగులు 242 పూర్తి అయ్యాయన్నారు. అలాగే ఆర్.బి.కెలు 193, హెల్త్ క్లినిక్లు 106 పూర్తి అయ్యి అన్నారు. మిగిలినవి వివిధ దశలలో ఉన్నాయన్నారు. జిల్లా వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ 665 ఖాళీలు ఉన్నాయన్నారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం పనుల బిల్స్ అప్లోడింగ్ లో అన్నమయ్య జిల్లా రాష్ట్రంలోనే టాప్ ప్లేస్‌లో ఉందన్నారు. ఇళ్ల నిర్మాణం కంప్లీషన్‌లో రాష్ట్రంలో 4వ స్థానంలో ఉన్నామన్నారు. మనబడి నాడు నేడు పనులు జూన్ 12 లోపల పూర్తి చేస్తామన్నారు. జగనన్నకు చెబుదాంను అధికారులు సీరియస్‌గా తీసుకొని అందిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. సమీక్షలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, ఎఎస్‌పి రాజ్ కమల్, ఆర్‌డిఒలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ప్రజలకు మెరుగైన సేవలందించాలి
గుర్రంకొండ : సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలని ఎపి డెయిరీ డెవలప్‌మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ అహ్మద్ బాబు సచివాలయ సిబ్బందికి సూచించారు. శుక్రవారం మండలంలోని నడిమికండ్రిగ గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, డాక్టర్ వైఎస్‌ఆర్ హెల్త్ క్లినిక్, అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ గిరీషతో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు వివిధ సమస్యలపై సచివాలయానికి వస్తుంటారని, సచివాలయానికి వచ్చే సర్వీసులను పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కారం చూపాలన్నారు. ప్రజలకు జాప్యం లేకుండా ప్రభుత్వ సేవలను పారదర్శకంగా అందించాలని అప్పుడే ప్రజలకు మనపై నమ్మకం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో జెసి ఫర్మాన్ అహ్మద్ ఖాన్, రాయచోటి, మదనపల్లె, ఆర్‌డిఒలు, రంగస్వామి, మురళి, వ్యవసాయ శాఖ జెడి ఉమామహేశ్వరమ్మ, వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కొండయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
పాడి రైతులు ప్రభుత్వ ప్రోత్సాహకాలు
మదనపల్లె అర్బన్: పాడి రైతులు ప్రభుత్వ ప్రోత్సాహకాలు సద్వినియోగం చేసుకొని అమూల్‌కు పాల సేకరణ 90 శాతం జరిగేటట్టు చూడాలని అహ్మద్‌బాబు అధికారులను ఆదేశించారు. మండలంలోని చిప్పిలి అమూల్ పాల డెయిరీని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాల సేకరణ కొరకు అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, డ్వాక్రా మహిళలు, ప్రజా ప్రతినిధుల సహకారంతో జగనన్న పాలవెల్లువ ప్రాముఖ్యతను పాడి రైతులకు తెలియజేసి అమూల్‌కు పాలు పోసే విధంగా వారిని ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, మదనపల్లె, ఆర్ డిఓ మురళి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.










