Jan 02,2023 19:57

బాధితులతో మాట్లాతున్న ఎఎస్‌పి రాజ్‌కమల్‌

ప్రజాశక్తి - రాయచోటి టౌన్‌ : జిల్లా పోలీసు కార్యాలయంలోని అదనపు ఎస్‌పి డాక్టర్‌ విబి.రాజ్‌కమల్‌ అధ్వర్యంలో సోమవారం స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 50 మంది ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఫిర్యాదుదారులతో అదనపు ఎస్పీ నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదుదారులతో సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడి సత్వరమే చట్టపరిధిలో పరిష్కారం చూపాలని అధికారులకు సూచించారు. భూ, సివిల్‌, కోర్టు పరిధిలోని వివాదాలలో న్యాయపరమైన సలహాలు పొంది తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, ఆస్తి తగాదాల దరఖాస్తులు అందించారు. చట్టపరిధిలో సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని సంబంధిత పోలీస్‌ అధికారులకు సూచించారు.