ప్రజాశక్తి-నందిగామ
నందిగామకు చెందిన జాస్తి హరిత వర్షిణి ఆత్మహత్య కు ఫైనాన్స్ రికవరీ ఏజెంట్లు కారణమని పోలీసులు నిర్ధార ణకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఆత్మహత్యకు సంబం ధించి నందిగామ పోలీస్ స్టేషన్లో నలుగురు రికవరీ ఏజెంట్లు పై కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. విజయవాడ కు చెందిన ఎస్‌ఎస్‌వి ఫైనాన్స్‌కు సంబందించిన రికవరీ ఏజెంట్లు గా ఉన్నారు. వీరు ప్రస్తుతం సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా రికవరీ ఏజెంట్లు వర్షిణి ఇంటికి పలుమార్లు వచ్చి హెచ్చరికలు చేసినట్లు సిసి టివి ఫుటేజ్ లో రికార్డులను పోలీసులు సేకరించారని సమాచారం. రికవరీ ఏజెంట్లు అయిన భాగ్యతేజ, పవన్ లు పలుమార్లు ఫోన్ లు వేసి వేదింపులు చేసినట్లు పోలీ సులు సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. వర్షిణి తండ్రి వద్ద కూడా పోలీసులు కొంత సమాచారం తీసుకుని విచారణ జరుపుతున్నారు.
50 వేలు ఆర్ధిక సాయం : ఆత్మహత్యకు పాల్పడిన జాస్తి హరిత వర్షిణి కుటుంబ సభ్యులకు మైలవరం ఎంఎల్‌ఎ వసంత కష్ణ ప్రసాద్ ఆదేశాల మేరకు నందిగామ కమ్మి కళ్యాణ మండపం ఆధ్వర్యంలో రూ.50 వేలు ఆర్ధిక సాయం అందజేసినట్టు నిర్వాహకులు తెలిపారు. హరిత వర్షిణి చెల్లెలు చదువు ఉచితంగా గుంటూరు కమ్మసంఘం భరిస్తున్నట్టు నందిగామ ఎఎంసి మాజీ చైర్మన్ పాలేటి సతీష్ ఆదివారం తెలిపారు.










