Apr 07,2022 17:00
  • పన్నుల పెంపును కేంద్రం ఉపసంహరించుకోవాలి
  • మహాసభలో తీర్మానం

ఇకె నయనార్‌ నగర్‌ (కన్నూరు) నుంచి ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి : పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపును నిరసిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలనిసీపీఐ (ఎం)... ప్రజలకుపిలుపునిచ్చింది. ఆయా ఉత్పత్తులపై బీజేపీ హయాంలో పెంచిన పన్నులను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు కేరళలోని కన్నూరులో కొనసాగుతున్న సిపిఎం 23వ అఖిల భారత మహాసభ తీర్మానించింది. దాని ప్రతిని గురువారం ఇక్కడి మీడియా సెంటర్‌లో పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పత్రికలకు విడుదల చేశారు. పెట్రో ధరల పెంపు వల్ల దేశంలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోతున్నదని ఈ సందర్భంగా మహాసభ ఆందోళన వ్యక్తం చేసింది. ఫలితంగా శ్రామిక, కార్మికవర్గం, పేదల నుంచి సంపద పెద్ద మొత్తంలో కార్పొరేట్లకు తరలిపోతున్నదని ఆవేదన వ్యక్తం చేసింది. 2014-15లో చమురు రంగం నుంచి కేంద్రం వసూలు చేసే పనుులు 0.74 లక్షల కోట్లుగా ఉంటే, బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని క్రమక్రమంగా పెంచుతూ 2021-22 నాటికి 3.5 లక్షల కోట్లకు చేర్చిందని వివరించింది. ఈ రకంగా నరేంద్రమోడీ సర్కారు ఆయా పన్నుల శాతానిు 5.4 నుంచి 12.2 శాతానికి పెంచిందని తెలిపింది. మార్చి 22 నుంచి ఇప్పటిదాకా ప్రతీరోజూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతూనే ఉన్నాయని గుర్తు చేసింది. మహాసభ ప్రారంభమయ్యేనాటికి (ఏప్రిల్‌ ఆరు) పెట్రోల్‌ ధరను లీటరుకు సగటున రూ.10.83, డీజిల్‌ రేటును రూ.10.47కు పెంచేశారని పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ... ఆ అంశాన్ని పరిగణనలోకి తీసుకోకుండా కేంద్రం ఇబ్బడిముబ్బడిగా పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచటం అత్యంత దారుణమని తెలిపింది. తీవ్రమైన ఆందోళనలు, ఒత్తిడి నేపథ్యంలో గత నవంబరు నుంచి పన్నులను పెంచకుండా ఉనుప్పటికీ... ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత మళ్లీ పెంచుతూ పోతునుదని వివరించింది. పైగా నెపానిు రాష్ట్రాల మీద మోపటం దుర్మార్గమనివిమర్శించింది. కోవిడ్‌ అనంతర పరిస్థితుల క్రమంలో ప్రస్తుతం పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలతో దేశ ప్రజలు మరిన్ని భారాలు మోయాల్సి వస్తునుదని తెలిపింది. ఇది దేశానికి అత్యంత ప్రమదకరమని మహాసభ హెచ్చరించింది. అయినా పెట్రో ఉత్పత్తులపై పనుులను ఉపసంహరించుకునేందుకు కేంద్రం సిద్ధపడటం లేదని విమర్శించింది. ఈ నేపథ్యంలో ఇలాంటి వాటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాలని ప్రజలకు పిలుపునిచ్చింది.