ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు బెయిల్ రాకుండా వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని నారా లోకేష్ వ్యాఖ్యలు సరికావని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. అవినీతికి పాల్పడి చంద్రబాబు అరెస్టయితే రాజకీయ కక్షతోనే అరెస్టు చేశామని లోకేష్ మట్లాడటం సరైందికాదన్నారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు న్యాయవాదులంతా విజయవాడలో ఉంటే లోకేష్‌కు ఢిల్లీలో పని ఏముందన్నారు. ఎవరిని మేనేజ్ చేద్దామని ఢిల్లీ వెళ్లారని ప్రశ్నించారు.










