ప్రజాశక్తి-సామర్లకోట రూరల్
రద్దుచేసిన విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు తదితర ప్యాసింజర్ రైళ్లను పునరుద్దించి ఎక్స్ప్రెస్ రైళ్లకు జనరల్ బోగీలను అదనంగా వేయాలని కోరుతూ సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం స్థానిక రైల్వే స్టేషన్ మేనేజర్ కె.రమేష్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కన్వీనింగ్ కమిటీ సభ్యులు కరణం ప్రసాదరావు మాట్లాడుతూ సామాన్యులు మధ్యతరగతి ప్రజలు ప్రయాణించే ప్యాసింజర్ రైళ్లు ఎప్పుడు నడుస్తున్నారు అనేది తెలీని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఎక్స్ప్రెస్ రైలులకు జనరల్ బోగీలు తగ్గించడం వల్ల అనేకమంది సామాన్యులు ప్రయాణాలు చేసేందుకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం శాఖ కార్యదర్శి బాలం శ్రీనివాస్, కరణం గోవిందరాజు, బాలం సత్తిబాబు, బత్తుల బాలాజీ, సిహెచ్.మహేష్, పి.వీరబాబు, బాలం హరిబాబు, కరణం ఏడుకొండలు, బాలం ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.