ప్రజాశక్తి-వీరబల్లి : హైడ్రోపవర్ ప్రాజెక్టు ఏర్పాటుతో మండలం అన్ని రకాల అభివృద్ధి జరుగుతుందని డిఆర్‌ఒ సత్యనారాయణ అన్నారు. ఆస్తా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మండలంలోని డి.రాచపల్లి వాండ్లపల్లి ప్రాథమిక పాఠశాల వద్ద శుక్రవారం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రజాభిప్రాయం మేరకు ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తారని చెప్పారు. చుట్టుపక్కల గ్రామాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం ఇవ్వడంతో పాటు విద్య, వైద్యం, మౌలిక వసతులు కూడా కల్పిస్తారన్నారు. నిర్మాణం జరుగుతున్న సమయంలో స్థానికులకు ఉపాధితోపాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారన్నారు. ప్రాజెక్ట్ నమూనా ప్రకారం ఎగువన, దిగువున జలాశయం పవర్ హౌస్, అనుబంధ మౌలిక సదుపాయాలు ఉంటాయన్నారు. ప్రాజెక్టు సామర్థ్యం 2720 నుండి 1800 మెగావాట్ల మార్పునకు భారత ప్రభుత్వం ద్వారా ఆమోదించిందని చెప్పారు. ప్రాజెక్ట్‌కు అవసరమైన భూమి 486.28 హెక్టార్లు, 325.89 హెక్టార్ల అటవీ భూమి, 160.39 హెక్టార్ల అటవీ ఈతర భూమి అవసరం అన్నారు. ఇది మూడు సంవత్సరాల ఆరు నెలలు ప్రణాళిక అబద్ధంగా పనులు చేపట్టామన్నారు. ఆస్తా గ్రీన్ ఎనర్జీ వెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి జివిఎస్‌డి ప్రసాద్‌రాజు మాట్లాడుతూ ప్రాజెక్టు ప్రధాన లక్షణాలను ఇఐఎ అధ్యయనం యొక్క ఆవిష్కరణలను ప్రజలకు వివరించారు. పర్యావరణ ఇంజినీరు జావిద్‌బాషా ప్రాజెక్టు ఏర్పాటుతో పర్యావరణానికి తీసుకునే చర్యలు గురించి వివరించారు. ప్రాజెక్టు చుట్టుపక్కల మొక్కల పెంపకం, పార్కుల అభివృద్ధి చేపడతామన్నారు. మాజీ ఎంపిపి విజయభాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు కృషి వెనక ఎంపీ, మంత్రి పాత్ర ఎంతో ఉందని చెప్పారు. ఎంపిపి రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ వంగిమళ్ళ గ్రామాల ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయని వాటన్నింటికీ ప్రాజెక్టు నిర్వాహకులు తగు వివరణ ఇవ్వాలని కోరారు. సింగల్ విండో ప్రెసిడెంట్ కల్లూరి రామ్మోహన్‌రెడ్డి ప్రజల రైతులు అభిప్రాయం మేరకు ప్రాజెక్టు వారు దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం భూములకు నష్టపరిహారం కల్పించాలన్నారు. న్యాయవాది పవన్ కుమార్‌రెడ్డి, వైసిపి నాయకులు మదన్‌రెడ్డి, జడ్‌పిటిసి శివరాం గౌడ్, పిఆర్‌సిఎఫ్ అధ్యక్షుడు సుంకు రవీంద్ర, సిద్దపటం రవి, పర్యావరణ నాయకులు రవీంద్రారెడ్డి, ఎంఎం రెడ్డి రమేష్ నాయుడు, తదితరులు అభిప్రాయాలను తెలిపి నిబంధనల మేరకు రైతులకు జనాలకు ఇబ్బందులు లేకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలన్నారు. ప్రాజెక్ట్ ఏర్పాటుతో నీటి సమస్య వచ్చే అవకాశం ఉందని ఇక్కడి మాండవ్య నీరు కాకుండా అన్నమయ్య, వెలిగల్లు, ప్రాజెక్టు నుంచి నీటిని సరఫరా చేసుకోవడంతో పాటు మండల వాసులకు సాగునీరు వసతి కల్పించాలన్నారు. మండలానికి 24 అవర్స్ విద్యుత్తు అందించాలన్నారు. స్థానికులకు ఉపధి కల్పిస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. గ్రామీణులు ప్రతిపాదిత ప్రాజెక్టును స్వాగతిస్తూ ప్రాజెక్టు వారి ప్రాంతంలో రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు సమావేశంలో డిఎస్‌పి శ్రీధర్, తహశీల్దార్ తులసమ్మ, ప్రాజెక్టు ప్రతినిధులు, ఆయా గ్రామాల రైతులు, ప్రజలు పాల్గొన్నారు.










