May 12,2023 22:33

ఫొటో : మాట్లాడుతున్న ఆత్మకూరు లైబ్రరీ ఇన్‌ఛార్జి శ్రీనివాసరాజు

పుస్తక పఠనంతో విజ్ఞానం
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : విద్యార్థులు పుస్తక పఠనాన్ని దినచర్యగా అలవాటు చేసుకోవడం వల్ల విజ్ఞానం పెరుగుతుందని ఆత్మకూరు లైబ్రరీ ఇన్‌ఛార్జి శ్రీనివాసరాజు అన్నారు. ఆత్మకూరు పట్టణంలోని గ్రంథాలయంలో సమ్మర్‌ క్యాంపులో భాగంగా విద్యార్థులతో పుస్తకాలు చదివించడం, కథలు చెప్పించడం, క్యారంబోర్డు లాంటివి ఆడిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మానసిక వికాసానికి ఎదుగుదలకు తోడ్పాటు ఇస్తారని తల్లిదండ్రులు విద్యార్థులను సమ్మర్‌ క్యాంపునకు పంపించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
సమ్మర్‌ క్యాంపు 5వ తేదీ నుండి జూన్‌ 11వరకు 35 రోజులు పాటు విద్యార్థులకు గ్రంథాలయంలో సమ్మర్‌ క్యాంపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రికార్డ్‌ అసిస్టెంట్‌ ఎల్‌.తనూజ విద్యార్థులు పాల్గొన్నారు.