Jun 02,2023 22:10

ఫొటో : బుక్స్‌ పంపిణీ చేస్తున్న దృశ్యం

పుస్తక పఠనం అలవర్చుకోవాలి
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : విద్యార్థులు విద్యార్థి దశ నుండి పుస్తక పఠనం అలవర్చుకోవాలని గ్రంథాలయ ఇన్‌ఛార్జి శ్రీనివాసరాజు అన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరాలలో భాగంగా శుక్రవారం ఆత్మకూరు శాఖా గ్రంథాలయంలో హాజరైన విద్యార్థులతో పుస్తకాలు చదివించడం, కథలు, డ్రాయింగ్‌, పేపర్‌ క్రాఫ్ట్‌, పాటలు, క్యారమ్స్‌ తదితర నృత్యాలను నిర్వహించారు.
ప్రతిభ కనపరచిన విద్యార్థులకు రిసోర్స్‌ పర్సన్‌ వెంకటేశ్వర్లుతో పుస్తకాలను బహుమతులుగా అందజేశారు. అనంతరం పిల్లలకు బిస్కెట్‌ ప్యాకెట్స్‌ పంపిణీ చేశారు. లైబ్రేరియన్‌ ఓంకారం శ్రీనివాసరాజు, రికార్డ్‌ అసిస్టెంట్‌ యల్‌. తనూజ, పాఠకులు పాల్గొన్నారు.