Jan 29,2023 22:42

సమావేశమైన పూర్వ విద్యార్థులు

గోరంట్ల : మండలంలోని బూదిలి గ్రామ పభుత్వ ఉన్నత పాఠశాలలో 1980 - 81 సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వవిద్యార్థులు ఆదివారం సమావేశమయ్యారు. తమ బాల్యమిత్రుడు ప్రకాష్‌ బాబు తన పెద్ద కుమారుడి వివాహ వేడుకల సందర్భంగా సమావేశమై అప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. సుమారు 42 సంవత్సరాల క్రితం పదో తరగతి చదివిన విద్యార్థులు ఇప్పుడు ఒకే వేదికపై ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని వారు తెలిపారు.