Feb 20,2022 12:27

సినీ తారలు వివాహం విషయంలో ఒకటికి వందసార్లు ఆలోచిస్తారు. తమ అభిరుచులు, అలవాట్లు కలిస్తేనే పెళ్లి బంధానికి ముందడుగు వేస్తుంటారు. ఇప్పటి వరకూ అనేక మంది తారలు ఇలాగే తమకు కాబోయే వాడు ఎలా ఉండాలో ఓ అభిప్రాయంతోనే ఆ దిశగా అడుగులు వేశారు. ఆ దారిలోనే ఇటీవల తెలుగు తెరకు పరిచయమైన నటి రుక్సార్‌ దిల్లాన్‌ కూడా తన మనసులో మాటను ఇటీవల ఓ ఇంటర్వ్యూ ద్వారా బయటపెట్టారు. తనకు కాబోయే జీవిత భాగస్వామిపై ఎలా ఉండాలో తనకు క్లారిటీ ఉందని తెలిపారు. అంతేకాదు ఏదైనా పూర్తిగా తెలుసుకుని, అర్థం చేసుకున్నాకే వివాహం చేసుకుంటానని సమాధానం చెప్పింది. ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ సరసన 'అశోకవనంలో అర్జున కల్యాణం' చిత్రంలో కథానాయికగా ఎంపికయ్యారు రుక్సార్‌. ఈ నేపథ్యంలో ఆమె పంచుకున్న పలు విశేషాలు...!

పేరు : రుక్సార్‌ దిల్లాన్‌ ఇతర పేర్లు : రుక్సా, రుక్సార్‌ మీర్‌
పుట్టిన తేదీ : అక్టోబర్‌ 12, 1993 పుట్టిన ప్రాంతం : లండన్‌
నివాస ప్రాంతం : బెంగళూరు, కర్ణాటక చదువు : ఫ్యాషన్‌ డిజైనింగ్‌
హాబీస్‌ : ట్రావెలింగ్‌ తల్లిదండ్రులు : దిల్లాన్‌, రమీందర్‌ దిల్లాన్‌
తోబుట్టువులు : సభిహా దిల్లాన్‌,
తేజిందర్‌ దిల్లాన్‌


'కృష్ణార్జున యుద్ధం' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హీరోయిన్‌ రుక్సార్‌ దిల్లాన్‌. వరుస సినిమాలతో ఫుల్‌ జోష్‌ మీద ఉన్న ఈ నటి ఆ తర్వాత ఏబీసీడీ చిత్రంలో అల్లు శిరీష్‌ సరసన నటించి మరో హిట్టు కొట్టారు. ప్రస్తుతం యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ హీరోగా తెరకెక్కుతున్న 'అశోకవనంలో అర్జున కల్యాణం' సినిమాలో కథానాయికగా చేస్తున్నారు. ఈ చిత్రం ముప్పై ఏళ్లు వచ్చిన ఓ వడ్డీ వ్యాపారీ పెళ్లి కోసం పడే పాట్ల నేపథ్యంలో సాగనున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రంలో ప్రమోషన్‌లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనకు కాబోయే వాడు ఎలా ఉండాలనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు రుక్సార్‌. ఇదే సందర్భంలో తాను గతంలో రిలేషన్‌షిప్‌లో ఉన్నానని పేర్కొన్నారు. అలాగే తనకు కాబోయేవాడు నిజాయితీగా, నిబద్ధతతో ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు.
 

                                                     పెళ్లిపై క్లారిటీ ఉంది..

'పెళ్లి చేసుకుని జీవితాంతం గడిపే వ్యక్తి గురించి ముందు పూర్తిగా తెలుసుకోవాలని అనుకుంటున్నట్లు తన మనసులో మాట బయటపెట్టారు. రుక్సార్‌. అయితే పూర్తిగా అర్థం చేసుకున్నాకే వివాహం చేసుకుంటానని, అలాగే ప్రేమ వివాహంపైనా నమ్మకం ఉంది' అని ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు రుక్సార్‌.
     2017లో 'ఆకతాయి' సినిమాతో టాలీవుడ్‌లో తెరంగ్రేటం చేసిన రుక్సార్‌, లండన్‌లో జన్మించారు. అక్కడే ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు. రుక్సార్‌ ఫ్యామిలీ బెంగళూర్‌లో సెటిల్‌ అవ్వడంతో అక్కడే నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సినిమాలపై ఉన్న ఆసక్తితో 2016లో 'రన్‌ ఆంటోని' చిత్రంతో కన్నడలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత 2020లో 'భాంగ్రా పా లే' అనే హిందీ సినిమాతో బాలీవుడ్‌లో కూడా పరిచయమయ్యారు. చెప్పుకోడానికి భారీ హిట్టులు లేకపోయినా, నటనపరంగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు.
    ఏబీసీడీ చిత్రంతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె 'అశోకవనంలో అర్జున కళ్యాణం' చిత్రంపై భారీ ఆశలే పెట్టుకున్నారు. అయితే ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పాటలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇందులో ఆమె అందంతో మెస్మరైజ్‌ చేస్తున్నారు.
 

                                                 పసుపులేటి మాధవిగా...

బాగా వెతికి వెతికి ఈ సినిమాకు హీరోయిన్‌ను పట్టుకున్నారు. ఈ సినిమా ప్రమోషన్లు కాస్త భిన్నంగా ఉండటంతో బాగా వైరల్‌ అవుతున్నాయి. హీరోయిన్‌ని రివీల్‌ చేయడానికి పిల్లను వెతికి పెట్టండంటూ వారు చేసిన ప్రచారం హిట్టయ్యింది. 'పసుపులేటి మాధవి' పాత్రకు ఎంపికైన రుక్సార్‌ దిల్లాన్‌ను ఇటీవలే హీరోయిన్‌గా రివీల్‌ చేశారు. రుక్సార్‌ను హీరోయిన్‌గా అధికారికంగా ప్రకటిస్తూ.. టీజర్‌ను విడుదల చేశారు. అప్పటికే ఈ పాత్రకు బాగా హైప్‌ ఇవ్వడంతో రుక్సార్‌ క్యారెక్టర్‌ 'పసుపులేటి మాధవి' నెట్‌లో వైరల్‌ అవుతోంది.