పురస్కారం అందుకుంటున్న రవ్వా శ్రీనివాసులు
ప్రజాశక్తి -కందుకూరు : కందుకూరు శ్రీరామ సాయిబాబా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు రవ్వా శ్రీనివాసులు సొసైటీ ద్వారా చేస్తున్న సేవలను గుర్తించి మయూరి ఆర్ట్స్ నిర్వాహకులు హైదరాబాద్‌లో భారతీయ విద్యాభవన్‌లో సోమవారం 2023 సంక్రాంతి పురస్కారాన్ని అందజేశారు. సముద్రాల వేణుగోపాలచారి, ప్రముఖ నాట్య గురువు అంజిబాబు, సీనియర్ మూవీ ఆర్టిస్ట్ సంధ్యా జనక్, ప్రముఖ మూవీ ఆర్టిస్ట్ సుమిత్ రాయి కింగ్ ఈ పురస్కారం అందజేశారు. రవ్వా శ్రీనివాసులు మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా చేస్తున్న సేవలను గుర్తించి సేవా రంగంలో మయూరి ఆర్ట్స్ నిర్వాహకులు సన్మానించి ఈ పుర స్కారం అందజేయడం సంతోషకరమన్నారు. శ్రీ రామ సాయి బాబా వెల్ఫేర్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.










