ఎమ్మెల్సీ షేక్ మహమమ్మద్ ఇక్బాల్‌కు శుభాకాంక్షలు చెబుతున్న మహిళలు
హిందూపురం : పట్టణంలో నూతన సంవత్సర వేడుకలు ఆదివారం సందడిగా జరిగాయి. ఈ సందర్బంగా ఆయా పార్టీల నాయకుల ఇళ్ల వద్ద నాయకులు, కార్యకర్తలు వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్సీ ఇక్బాల్ నివాసం వద్దకు నియోజక వర్గ వ్యాప్తంగా ఉన్న అధికారులు వెళ్లి ఆయనకు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మెప్మా మహిళులు ఎమ్మెల్సీ నివాసం వద్ద కేక్ కట్ చేశారు. పట్టణంలోని కోర్టు ఆవరణంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. అదనపు జిల్లా జడ్జి శైలజ, సీనియర్ సివిల్ జడ్జి శ్రీధర్, జూనియర్ సివిల్ జడ్జిలు స్పందన, రాజ్యలక్ష్మిలతోపాటు ప్రత్యేక న్యాయమూర్తి ఆనందతీర్థలకు ఆయా కోర్టుల సిబ్బంది, న్యాయ వాదులు బొకేలు, పండ్లు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.










