Jul 08,2023 21:56

పోస్టుకార్డులు పంపుతున్న నరేష్‌

      హిందూపురం : హిందూపురం నుంచి వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కుటుబం నుంచి ఎవరైన పోటీ చేయాలని కోరుతూ వైసిపి నాయకులు వాల్మీకి నరేష్‌ ఆధ్వర్యంలో శనివారం నాడు పోస్టు కార్డు ఉద్యమాన్ని చేపట్టారు. వైఎస్‌ఆర్‌ జయంతిని పురష్కరించుకుని ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అక్కడి నుంచి ప్రధాన తపాలా కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి హిందూపురం నుంచి శాసన సభ ఎన్నికల్లో పోటీ చేయాలని కోరుతూ కార్డులు పోస్టు బాక్సులో వేశారు.