Nov 30,2022 21:30

పురం ఆసుపత్రిలో గర్భిణితో మాట్లాడుతున్న కేంద్ర బృందం సభ్యులు

          హిందూపురం: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం జిల్లా ఆసుపత్రిలో కేంద్ర బృందం బుధవారం పర్యటించింది. రాష్ట్ర ప్రభుత్వం రక్తహీనత, చిన్నారులు, గర్బిణులకు అందిస్తున్న పౌష్టిక ఆహారం తదితర విషయాలను తెలుసుకునేందుకు పరిశీలన చేపట్టింది. కేంద్ర బృందం సభ్యులు డాక్టర్‌ భానుమూర్తి, డాక్టర్‌ పూర్ణిమా, మాలవికలు హిందూపురం ఆసుపత్రిలో పర్యటించి అక్కడి వివరాలను జిల్లా ఉప వైద్యాధికారిణి మంజువాణి, పిపి యూనిట్‌ వైద్యులు డాక్టర్‌ ఆనంద్‌బాబు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పట్టణంలోని ఎంజిఎం పాఠశాలతో పాటు పలు అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. ఎంజిఎం పాఠశాలలో కొందరు బాలికలు రక్తహీనతతో భాధపడుతున్నారని, వారికి మురుగైన చికిత్సలు అందించాలని కేంద్ర బృందం సభ్యులు స్థానిక వైద్యులకు సూచించారు. కర్నాటక రాష్ట్రం బెంగళూరులో వాణివిలాస్‌ అసుపత్రిలో డిఐసి కేంద్రం ఉందని రక్తహీనతతో ఎక్కువ భాదపడే వారిని అక్కడిని పంపి మెరుగైన చిక్సిలు అందించాలని తెలియజేశారు. ఎక్కువ మంది అమ్మాయాలు రక్తహీనతతో భాధపడుతుంటారని, అలాంటి వారిని గుర్తించి అవసరం అయితే రక్తం ఎక్కించడానికి ప్రయత్నం చేయాలని సూచించారు. రక్తహీనతను తగ్గించడానికి స్థానిక వైద్యులు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై కేంద్ర బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమంలో జిల్లా అసుపత్రి ఆర్‌ఎంఒ రుక్మిణమ్మ, వైద్యులు పాల్గొన్నారు.