Apr 16,2023 21:35

పూర్తిగా దగ్ధమైన పూరిల్లు

ప్రజాశక్తి-వలేటివారిపాలెం : మండలంలోని పోకూరు గ్రామ bస్టీకాలనీలో నివాసం ఉంటున్న తలపల ఏసురత్నం పూరిల్లు ఆదివారం మధ్యాహ్నం పూర్తిగా దగ్ధమైంది. కుటుంబ పెద్దలు పని నిమిత్తం బయటకు వెళ్లారు. ఈ క్రమంలో పిల్లలు వంట చేసేందుకు ప్రయత్నించగా, నిప్పురవ్వలు bగిసిపడి ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో ఇల్లు పూర్తిగా కాలిపోయింది. దీంతో పాటు ఇంట్లో ఉన్న బట్టలు, ఆధార్‌, రేషన్‌కార్డులు వంటి విలువైనవన్నీ దగ్ధమయ్యాయి. బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. ప్రభుత్వం స్పందించి బాధితులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. వారికి శాశ్విత గృహం కట్టించి ఇవ్వాల్సిరదిగా విజ్ఞప్తి చేస్తున్నారు. విషయం తెలుసుకున్న మాజీ మార్కెట్‌ కమిటి చైర్మన్‌ గట్టమనేని చెంచురామయ్య, టిడిపి మండల ప్రధాన కార్యదర్శి గురిజాల బెరజిమెన్‌, గౌడపేరు శింగయ్య, తెలుగుయువత అధ్యక్షులు బద్దిపూడి శిఖామణి, జలదంకి పాపయ్య తదితరులు ఆ కుటుంబాన్ని పరామర్శించింది. ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.